ఉపోద్ఘాతం: ఆవేదన మనస్సుకు ఆలాపన వంటిది. ఆలపించని గొంతుకకు ఆవేదనపడే మనస్సుకు పొంతన కుదరక జరిగే సంఘర్షణ....
ఏమని చెప్పను
ఎలాని చెప్పను
మనస్సు లోతుల్లోని భావోద్వేగం
నివురుగప్పిన నిప్పులా ప్రళయానికి ఉవ్విళ్ళూరుతుంటే
అగ్ని పర్వతం బ్రద్దలయ్యేనా !!
లోపలనున్న లావా దహిస్తుంటే
వెలుపలకు తీసుకు రావాలనే ప్రయత్నంలో
నేను సమిధను అవుతుంటే
చల్లార్చే మార్గం కోసం అన్వేషిస్తూ
గతి తప్పిన మనస్సు చెదిరిన సుందర స్వప్నం
ప్రోది చేసుకునే ప్రయత్నంలో
నేనెవరినో మర్చిపోయి అల్లాడుతుంటే
నా గమ్యం ఏది ! నా గమ్యం ఎటు !!
9, జూన్ 2009, మంగళవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ee post ni nene type chesaanu
రిప్లయితొలగించండి