ఉపోద్ఘాతం: స్రుష్థికి మూలం "ఆడది". కానీ నేటికి మహిళ ఒక ఆట వస్తువు గ చూడబడుతుంది. అన్ని ఓడిదుడుకులను అధిగమిన్చిన ఇంకా ఏదో మహిళా స్వాభిమనానికి అడ్డంకవుతుంది. ఏప్పుడు మహిళ వస్తువుగ కాకుండా మనిషిగ గుర్తింపబడుతుందో....
కదిలే బొమ్మల ఆట
కాదా ఈ జీవిత గాధ
ముసుగులోనే వున్నది జీవితమంతా
కోరిన వెలుగే దోబూచులాడే
పగలే వెన్నెల హాయ్, సాగే జీవిత రేయి
రాముని ఎదిరించలేని నీ వోరిమెన
స్త్రీ జాతికే శాపమాయే
ఏమిటమ్మా సీతమ్మ
ఆదర్శమైన స్త్రీ మూర్తి
ఎదురులేని బాటసారివా
లోకమంతా ఎడారిలే
ఎండమమి కోసం నీ వెతుకులాతా
ఆపెదేవరమ్మా నీ కష్టం తీర్చేదేవరమ్మా
ఆలోచనలే నీ కంట నీరై
విచక్షణతో విచ్చుకునే కళ్లు
నీ నుదుట రాతను మార్చేన
సమాజమే నీ బలి దానం ; కోరిన్దమ్మ వో పిచ్చి తల్లి
వగరపోతు గాంభీర్యం
చూట్టుముట్టే సుడి గాలి
నీ నిత్య జీవిత కేళి
కాదా నీ బ్రతుకింక హోలీ
ముళ్ళపొదల పేటిక
కాదా ఈ ధరిత్రి వేదిక
రగులుతున్న నిప్పు కణిక
నిన్నే కాల్చేదమ్మ
పండగ సుఖమే నే కోరినాన
పాపాలేమైన చేసినాన
ఊరికే మనస్సుకు పగ్గం
నాకేక్కదడే శాపం
గిలిగింతలే పెట్టిన పిల్ల మారుతం
కబలించనే పెనుభూతమయ్యి
నేనెలా బయటికి వచ్చే
బంధమే గాడాంధకారం
ఎదురుచూసేనే ఆ వసంతరేయి
రేయింబవల్ల కష్టమే కరిగిపోయే
నీ రెక్కలే సమాజ బాసట
అమ్మ రొమ్మునే తలదన్నితే
ఏమి చేసేదమ్మ ఎట్లా బ్రతికేదమ్మా
గుండెలోని విషాదం రానీయకేప్పుడు
వెలుగు జాతి మనిషీవమ్మ
మహిళలే సమాజ ఆభరణం
ఏమి ఇస్తే తీరేనమ్మ "ఆమె భరణం"
ట్యూన్: మెరిసే పండగ పూట (సినిమా: క్షత్రియ పుత్రుడు)
10, జూన్ 2009, బుధవారం
నా..నా..నాకెంతో ఇష్టం
ఉపోద్ఘాతం: నాకు నచిన విషయాలను సంగ్రహిన్ఛి కూర్ఛి రాసిన సంకలనం. మా బాస్ మన్దలింపులైనా, చిన్న పిల్లల కేరింతలైన, నా దేశమైన, క్రికెటైన, రాజకీయాలైనా, అమ్మ అయినా ఏదైనా నాకూ మహా మహా ఇస్థమైనవే. మరియొకసరి నన్ను నేను అవలోకనం చేసుకుంటూ...
<< నా..నా..నాకెంతో ఇష్టం >>
అమ్మ గారాబం; నాన్న కోపము <<నా..నా..>>
నాన్నగారి నవ్వులు ; అమ్మవేమో పువ్వులు <<నా..నా..>>
తాతయ్య గురకలు; అమ్మమ్మ పచ్చళ్లు <<నా..నా..>>
కృష్ణ గారి అరుపులు; సచినుడి మెరుపులు <<నా..నా..>>
శ్రీశ్రీ మహాప్రస్థానం; యర్నగూడెం ఆస్థానం <<నా..నా..>>
దేశం కోసం పోరాడే సైనికులు; హక్కులకై ఊద్యమించే మానవతావాది <<నా..నా..>>
పల్లెవాసపు సుఖాలు; పట్నాల కష్తాలు <<నా..నా..>>
మన అన్నా తెలుగు దేశం;గర్వించే భారత దేశం <<నా..నా..>>
రాజీ లేని రాజకీయం; పోటీపడే క్రికెట్ <<నా..నా..>>
అసెంబ్లీ లో న్యూసెన్స్;పెరుగుతున్న సెన్సెక్స్ <<నా..నా..>>
సిక్సులు కొట్టే యువరాజు; బంతిని తిప్పే అనీలు <<నా..నా..>>
క్లాస్సురూములో అల్లరి; సినిమాహాలు వల్లరి <<నా..నా..>>
కదిలే సముద్రపు కెరటం; ఎగిరే ఆశయాల పోరాటం <<నా..నా..>>
మణిరత్నం సినిమాలు;ఇల్లయరాజ సంగీత సాంద్రం <<నా..నా..>>
చార్మీ చలాకీతనం;కాంగ్రెస్ వాది కానీ నాగార్జున <<నా..నా..>>
పెరుగుతున్న పనులు; తరుగుతున్న ఓపికలు <<నా..నా..>>
రోజంతా నిద్రపోవటం; తిన్నదంతా అరిగిపోవడం <<నా..నా..>>
వూసిపోని బాతాకాని ; టెర్రరిస్టు ల ఖూని <<నా..నా..>>
మెరిసే బంగారం;కరిగే సింధూరం <<నా..నా..>>
దేశభక్తి పాటలు;ఎన్టీయార్ మాటలు <<నా..నా..>>
కోడిగుడ్డు అమ్లేట్టు;మసాల వేసే చికెన్ <<నా..నా..>>
పొడుగుందే ములక్కాయ;వేసవిలో తినే మామిడికాయ <<నా..నా..>>
అందమైన పువ్వులు; చిన్నారుల నవ్వులు <<నా..నా..>>
రేగిపోయిన జుట్టు; వీడిపోని పట్టు <<నా..నా..>>
తైతక్కలాడే క్లాసికల్; నేను పాడే ముజికల్ <<నా..నా..>>
నేను తోలిన స్పిరిట్; ఎప్పుడు నాలో వుండే మెరిట్ <<నా..నా..>>
అర్ధం లేని నియమాలు; నేర్చుకున్నఓనమాలు <<నా..నా..>>
క్లాస్సులో గీచె పిచ్చి గీతలు; బ్రహ్మ గీతలు మార్చే వాతలు <<నా..నా..>>
కేరింతలు కొట్టే కుర్రకారు; షైరుకు తీసుకునేవేల్లె నా టయోట కారు <<నా..నా..>>
నేను చేసే వంటలు ; నేను చూసే సినిమాలు <<నా..నా..>>
ఎప్పుడు నా ప్రక్కనుండే ల్యాప్తాపు; నేను చేరుకోవాలని చూసే టాపూ <<నా..నా..>>
పోరాడే నక్సల్స్ ; చ్చేదించే మిస్సయిల్స్ <<నా..నా..>>
వొడిలో నిద్రించే పసి పాపా; రెపరెపలాడే కనుపాప <<నా..నా..>>
దేవుడుండే కోవెల; పరవళ్ళు తొక్కే నయాగారా <<నా..నా..>>
ఆలోచించా ... ఇంకేమి ఇష్టమని
పరిశోదిన్చా.... నా దినచర్యని
ఎన్ని కష్టాలైన నష్టాలైన వీడనులే నా దారిని రహదారిని
ట్యూన్: నా..నా.. (సినిమా: రాక్ ఆన్)

నేటి సమాజం
ఉపోద్ఘాతం: నేటి సమాజ నాగరిక ప్రపన్ఛికరణకు ప్రతీకా లేక పెరుగుతున్న అసమానతలను తనలో ఇముడ్ఛుకుని ప్రగతికై పరుగు పెడుతూ దప్పికతో అలిసి నీరు అన్దక చతికలపడిన ఆశయమా. నీటి కోసం ప్రయత్నం కూడ చేయక పరుగు పెటాలని వ్రుధా ప్రయస పడుతున్న నేటి సమాజం ఈ లక్ష్య సధనలో విజయం సాధిన్ఛేనా...
<< ఏమైనదోమరి ఈ సమాజానికి తెలియదామరి ఈ జనానికి >>
నాకు నీకు వున్న భాంధవ్యం ఎప్పుడో తెగిపోయే
నేను నువ్వు ముఖాలే చూసుకోకపోయే
పాపిష్టి స్వార్ధమేమో లోకాన్ని చుట్టిపోయే
విశాల ప్రపంచములో మూడడుగులు దొరకకపోయే <<ఏమైనదోమరి>>
గుక్కెడు నీళ్ళ కోసం గొంతు తడరిపోయే
కూల్ డ్రింక్ హాట్ డ్రింక్ అంటు పైసలే కావాలయే
కడుపు నింపే ధాన్యం పండకపోయే
సర్కారు పదకమేమో మనకు అందకపోయే <<ఏమైనదోమరి>>
డబ్బు కోసమే వేమ్పర్లడుతూ వెతుకుతుపోయే
బీద బిక్కి గోడు అసలే పట్టకపోయే
సాతి మనిషికేమో ముఖము చాటేసి పోయే
రంగుల ప్రపంచపు కలలో అల్లుకునిపోయే <<ఏమైనదోమరి>>
ఉద్యోగం వస్తేనేమో దండిగా జేబు నింపుకునే పోయే
చదువు ఏమో నీకేమే పట్టకపోయే
కొలువు కోసమే విజ్ఞానం అంటు పోయే
విద్య విలువలను దిగజార్చి పోయే <<ఏమైనదోమరి>>
పల్లెసీమలేమో అంతరించిపోయే
ప్రజలేమో పట్టణానికి ఎగబదిపోయే
ముదసలలను చూచుకునే దిక్కులేకపోయే
బంధాలు తెగిపోయే బంధుత్వం వీడిపోయే <<ఏమైనదోమరి>>
అవినీతి కోరలేమో లోతుగా దిగబడిపోయే
సర్కారు జమానాలో మూట విప్పితే కానీ పని జరగకపోయే
అర్హుడిని వీడి అనఃరుడికి పట్టం కట్టిపోయే
అభివృద్ది ఏమో గుండు సున్నా ఆయే <<ఏమైనదోమరి>>
బంధుప్రీతి సమాజాన్నిఅంటుకునిపోయే
రాజకీయం రాజుల కార్యం అయిపోయే
వజ్రాలేమో భూమిలోనుండి వెలుపలకు రాకపోయే
భూమాత భారమేమో ఎవరు తీర్చకపోయే <<ఏమైనదోమరి>>
రగిలే విప్లవాలు అడుగంటిపోయే
ఆరాటం లేని పోరాటం రోజు వారి కార్యమయ్యే
కమ్యూనిజం సోషలిజం అన్ని కాపిటలిజం అయ్యే
లోకములో మంచితనం అంతరించిపోయే <<ఏమైనదోమరి>>
సర్కారు పధకాలు అబద్ధాల అమ్మకాలయే
దంచుడు బొంకుడే రాజకీయాల నీతి ఆయె
జనాల డబ్బంతా మార్గమధ్యలోనే చేల్లిపోయే
నిండని కడుపులు ఆకలితో అలమటించిపోయే <<ఏమైనదోమరి>>
సాగునీరు లేక పంట భూములు బీడులు అయ్యే
ఊన్న భూమినేమో అపార్ట్మెంట్ ల కబ్జ్హ అయ్యే
లక్షల భూమి కోట్లకై పడగలేట్టిపోయే
రియల్ ఎస్టేట్ భాగోతం గుండెల్లోని బాకు అయ్యే <<ఏమైనదోమరి>>
సమాజం ఎన్నో సమస్యల తో నిండిపోయే
ప్రస్తావిస్తే పేజీలే నిండిపోయే
ఇవన్నితీరే రోజు కోసం ఎదురుచూస్తుపోయే
నగారా పట్టి విప్లవ శంఖం పూరించి ఘర్జించి పోయే <<ఏమైనదోమరి>>

9, జూన్ 2009, మంగళవారం
ఆ కారం ఓం కారం...
ఉపోద్ఘాతం: ఈ కవిత లోని ప్రతి పంక్తి "అ" అక్షరముతో మొదలుపెట్టబడినది. "అ" కారం అమ్మ చల్లని చెయ్యి అయ్యి స్రుస్థికి "ఓం" కారరూపమ్ దాల్ఛి సమాజ సౌధానికి పునాది వేసి....
ఆవేశం తో ప్రశ్నిస్తున్న నేనేవరినని
ఆవేదనతో అడుగుతున్నా అంగడి సరుకునా అని
ఆగ్రహం లో తెలేయట్లేదే నా దారేటని
ఆరాటం లో మర్చితినే రహదారిని
అపూర్వమైనది కోరుకున్న
అంతులేని దానికి చిక్కుకుని పోయా
అందమైన ధరిత్రి ఇదే
అదుపు లేని మరో చరిత్ర దానికే
ఆశయం తో సాగాలని అనుకున్నా
ఆలోచనల ప్రపంచాన్ని నిర్మించాలని
అరువిచ్చే ఈ సంస్కారం తో
అమరేనా మన భవితవ్యం
అలవాటు లేని మనిషి తత్త్వం
ఆది లోనే హంసపాదు
అరమరికలు లేని సమాజం
అర్ధరహితమా !! భావరహితమా !!
అరునోదయించే ఆ రోజు
ఆకాశమే వెలుగొందేను
ఆనాటి రోజు ఈనాటి రోజు
అలనాటి బంగారు పంజరం
ఆరగించే పంచభక్ష్యం
అగట్లేదే నీ దయ కోసం
ఆక్రోశించే నా కనులలో
ఆకలి మంటల అ చితి
ఆరని మంటల కాంతులు
ఆపేనా కీచక దాష్టికం
ఆరోగ్యం మహాభాగ్యం
అందరికి చేరని నేటి వైద్యం
అదిగదిగో విప్లవం
అలుపెరగని పోరాటం
అన్యాయాల సమాజం
అక్రమాల నిలయం
ఆరంభమైనది యుద్ధం
ఆదర్శమైన చైతన్యం
అవసరమైన మార్పూ తో
అంకురించే విశ్వ మానవాల్లి సౌభాగ్యం
ఆస్వాదించే విజయం
ఆశించే అమర సౌధం
ఆయువు పోసే నవ సమాజ నిర్మాణానికి
అంతం లేని మరో ఆరంభానికి
ఆవేశం తో ప్రశ్నిస్తున్న నేనేవరినని
ఆవేదనతో అడుగుతున్నా అంగడి సరుకునా అని
ఆగ్రహం లో తెలేయట్లేదే నా దారేటని
ఆరాటం లో మర్చితినే రహదారిని
అపూర్వమైనది కోరుకున్న
అంతులేని దానికి చిక్కుకుని పోయా
అందమైన ధరిత్రి ఇదే
అదుపు లేని మరో చరిత్ర దానికే
ఆశయం తో సాగాలని అనుకున్నా
ఆలోచనల ప్రపంచాన్ని నిర్మించాలని
అరువిచ్చే ఈ సంస్కారం తో
అమరేనా మన భవితవ్యం
అలవాటు లేని మనిషి తత్త్వం
ఆది లోనే హంసపాదు
అరమరికలు లేని సమాజం
అర్ధరహితమా !! భావరహితమా !!
అరునోదయించే ఆ రోజు
ఆకాశమే వెలుగొందేను
ఆనాటి రోజు ఈనాటి రోజు
అలనాటి బంగారు పంజరం
ఆరగించే పంచభక్ష్యం
అగట్లేదే నీ దయ కోసం
ఆక్రోశించే నా కనులలో
ఆకలి మంటల అ చితి
ఆరని మంటల కాంతులు
ఆపేనా కీచక దాష్టికం
ఆరోగ్యం మహాభాగ్యం
అందరికి చేరని నేటి వైద్యం
అదిగదిగో విప్లవం
అలుపెరగని పోరాటం
అన్యాయాల సమాజం
అక్రమాల నిలయం
ఆరంభమైనది యుద్ధం
ఆదర్శమైన చైతన్యం
అవసరమైన మార్పూ తో
అంకురించే విశ్వ మానవాల్లి సౌభాగ్యం
ఆస్వాదించే విజయం
ఆశించే అమర సౌధం
ఆయువు పోసే నవ సమాజ నిర్మాణానికి
అంతం లేని మరో ఆరంభానికి
నేను కోరే విప్లవం
ఉపోద్ఘాతం: చీకటితో వెలుగే చెప్పెను నేనున్నాని అన్నట్లు అణచివేత లోంచి పోరాటం రగులుతుంది విప్లవ జ్వాలల శికలుగా. ప్రతి ఓటమి ఒక విజయానికి సంకేతం, ఒక ఆలోచనకు పునాది, ఒక చైతన్యానికి ఊపిరి. లక్ష్య సాధన కోసం పడి లేచిన కెరటం...
నా గొంతు తడారిపోయింది
నా కాళ్ళు చచ్చుబడినాయి
నా చేతులు బంధింపబడ్డాయి
నా మనస్సు బాధపడ్తుంది
నా శరీరం అలిసిపోయింది
నా కళ్లు కన్నీటి ధారలవుతున్నాయి
నా ముక్కు పుటలు కమ్పిస్తున్నాయీ
కానీ ఏదొక రోజు
నా చేతి బంధనాలు విచ్చుకుంటాయి
విశ్వ మానవాళి శ్రేయస్సుకై అర్రులు చాస్తూ
నా పాదాలు నిబ్బరముగా చెంగున లక్ష్యం కోసం పరిగెడతాయి
దారిలో ఎదురైన ఆటంకాలను దాటుకుంటూ
నా గొంతు ఎలుగెత్తి కర్తవ్యాన్ని చాటుతుంది
నలుదిక్కులు పిక్కటిల్లేలా
నా మనస్సు ఇంద్రధనుస్సు అయి పరితపిస్తుంది
క్రాంతి ని వీడి కాంతి వైపు సాగమని
నా నయనాలు కలియతిరుగుతూ
నవలోకాన్ని కళ్ళ చూస్తాయి
నా ముక్కు పుటలు స్వేచ్ఛా వాయువును పతాకాన్నిపీలుస్తాయి
మనస్సులో ఆనందాన్ని నింపుతూ
నా శరీరం నాదై , నీదై , అందరిదై
సమాజ శ్రేయస్సుకై పోరాడుతూ
అశువులు దాలుస్తుంది
స్ఫూర్తి: అమృత (సినిమా)

నేను మెచ్చిన ఆటగాడు - అనీల్ కుంబ్లే
ఉపోద్ఘాతం: నాకు నచ్చిన ఆటలో నేను మెచ్చిన ఆటగాడు అనీల్ కుంబ్లే. ఫాస్ట్ బౌలర్, స్పిన్నర్ లను కలిపి నూతన శైలితో నేటి శతాబ్దపు క్రికెట్ వినీలాకశములో తనదైన ముద్రను వేసుకుని అందరు మెచ్చి భారత దేశం గర్వించే మహోన్నత వ్యక్తిత్వ సారధి, అత్యున్నత శికరాలను అధిరోహించిన లెగ్ స్పిన్నర్, గూగ్లీ ల వీరుడు, ఐదు వందల పై చిలుకు వికట్లను కొల్లగొట్టిన నాటి, నేటి, మరెప్పటికీ మరువలేని మరుపులేని క్రికెట్ మైదానపు విజేత. పోరాట ధీరుడు ల బంతిని గింగురులు తిప్పుతూ ఎక్ష్త్ర బౌన్స్ తో బాట్స్మన్ ని ముప్పతిప్పలు పెట్టినా, సారధి అయ్యి జవసత్వాలు లేని బెంగుళూరు జట్టు ని ఫైనల్స్ వరకు తన భుజస్కన్దాల మీద మోసుకునివచ్చినా, గాయం తో మళ్ళి మైదానం లో అడుగుపెట్టినా, పదిహేను సంవత్సరాల పైన భారతీయ క్రికెట్ అభిమానుల ఆశలను నిర్విగ్నముగా నెరవేర్చినా, కెరీర్ అయిపొయింది అన్న సమయములో వికెట్ల జడివాన కుర్పించినా, అది ఒక "పది వికెట్ల" శౌర్యుడికె సాధ్యం. అనీలుడు ఆంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు చెప్పిన సందర్భములో స్పందించి విషాద వదనం తో పల్కిన అక్షర నీరాజనం.
అలుపెరగని ధీరుడవు
శ్రమించే శ్రామికుడవు
స్ఫూర్తిని రగిల్చే ప్రధాతవు
మృదువైన నీ మాటతీరు, శిరస్సు వంచి జయాపజయాలను
చిరునవ్వుతో స్వీకరించే వ్యక్తిత్వ మూర్తుడవు
గాయానికి బెదరని మొక్కవోని ధైర్యం తో
ముందడుగు వేయగల సమర్దుడవు
నేడు వయస్సు భారానికి తలవంచినావా
సలాం శిరస్సు వంచి నీకు సలాం
నీవు లేని క్రికెట్ మైదానం బోసిపోతుందా
జుంబో లేదని ఆగ్రహిస్తుందా
ఆరు అడుగుల ఆజానుబాహుడు కోసం అర్రులు చాస్తుందా!!
నాట్యం ఆడించే చేతులు లేక బంతులు ముడుచుకుంటే
"ఎక్ష్త్ర బౌన్స్" చూడలేక నేను కళ్ళు తిప్పుకుంటే
నింగి కి ఎగసిన నీ కీర్తి పాటవం నన్ను హర్షిస్తుందా!!
నీవు సాధించిన విజయాలు ముందు తరానికి మార్గదర్శకం అయితే
మాకు మాత్రం ఆస్వాదించిన ఆనందాలు
స్పిన్నర్ లేక మీడియం పేసర్ అన్న సందేహాన్ని ప్రక్కన పెట్టి
నా అనీలుడకు చెప్పండి వీడ్కోలు
నీ అభిమనినైన నేను నీకు పలికే "గూగ్లీ" నీరాజనం

అంతర్మధనం
ఉపోద్ఘాతం: ఆవేదన మనస్సుకు ఆలాపన వంటిది. ఆలపించని గొంతుకకు ఆవేదనపడే మనస్సుకు పొంతన కుదరక జరిగే సంఘర్షణ....
ఏమని చెప్పను
ఎలాని చెప్పను
మనస్సు లోతుల్లోని భావోద్వేగం
నివురుగప్పిన నిప్పులా ప్రళయానికి ఉవ్విళ్ళూరుతుంటే
అగ్ని పర్వతం బ్రద్దలయ్యేనా !!
లోపలనున్న లావా దహిస్తుంటే
వెలుపలకు తీసుకు రావాలనే ప్రయత్నంలో
నేను సమిధను అవుతుంటే
చల్లార్చే మార్గం కోసం అన్వేషిస్తూ
గతి తప్పిన మనస్సు చెదిరిన సుందర స్వప్నం
ప్రోది చేసుకునే ప్రయత్నంలో
నేనెవరినో మర్చిపోయి అల్లాడుతుంటే
నా గమ్యం ఏది ! నా గమ్యం ఎటు !!

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)