9, జూన్ 2009, మంగళవారం

ఆ కారం ఓం కారం...

ఉపోద్ఘాతం: ఈ కవిత లోని ప్రతి పంక్తి "అ" అక్షరముతో మొదలుపెట్టబడినది. "అ" కారం అమ్మ చల్లని చెయ్యి అయ్యి స్రుస్థికి "ఓం" కారరూపమ్ దాల్ఛి సమాజ సౌధానికి పునాది వేసి....

ఆవేశం తో ప్రశ్నిస్తున్న నేనేవరినని
ఆవేదనతో అడుగుతున్నా అంగడి సరుకునా అని

ఆగ్రహం లో తెలేయట్లేదే నా దారేటని
ఆరాటం లో మర్చితినే రహదారిని

అపూర్వమైనది కోరుకున్న
అంతులేని దానికి చిక్కుకుని పోయా

అందమైన ధరిత్రి ఇదే
అదుపు లేని మరో చరిత్ర దానికే

ఆశయం తో సాగాలని అనుకున్నా
ఆలోచనల ప్రపంచాన్ని నిర్మించాలని

అరువిచ్చే ఈ సంస్కారం తో
అమరేనా మన భవితవ్యం

అలవాటు లేని మనిషి తత్త్వం
ఆది లోనే హంసపాదు

అరమరికలు లేని సమాజం
అర్ధరహితమా !! భావరహితమా !!

అరునోదయించే ఆ రోజు
ఆకాశమే వెలుగొందేను

ఆనాటి రోజు ఈనాటి రోజు
అలనాటి బంగారు పంజరం

ఆరగించే పంచభక్ష్యం
అగట్లేదే నీ దయ కోసం

ఆక్రోశించే నా కనులలో
ఆకలి మంటల అ చితి

ఆరని మంటల కాంతులు
ఆపేనా కీచక దాష్టికం

ఆరోగ్యం మహాభాగ్యం
అందరికి చేరని నేటి వైద్యం

అదిగదిగో విప్లవం
అలుపెరగని పోరాటం

అన్యాయాల సమాజం
అక్రమాల నిలయం

ఆరంభమైనది యుద్ధం
ఆదర్శమైన చైతన్యం

అవసరమైన మార్పూ తో
అంకురించే విశ్వ మానవాల్లి సౌభాగ్యం
ఆస్వాదించే విజయం
ఆశించే అమర సౌధం
ఆయువు పోసే నవ సమాజ నిర్మాణానికి
అంతం లేని మరో ఆరంభానికి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి