9, జూన్ 2009, మంగళవారం

నేను మెచ్చిన ఆటగాడు - అనీల్ కుంబ్లే

ఉపోద్ఘాతం: నాకు నచ్చిన ఆటలో నేను మెచ్చిన ఆటగాడు అనీల్ కుంబ్లే. ఫాస్ట్ బౌలర్, స్పిన్నర్ లను కలిపి నూతన శైలితో నేటి శతాబ్దపు క్రికెట్ వినీలాకశములో తనదైన ముద్రను వేసుకుని అందరు మెచ్చి భారత దేశం గర్వించే మహోన్నత వ్యక్తిత్వ సారధి, అత్యున్నత శికరాలను అధిరోహించిన లెగ్ స్పిన్నర్, గూగ్లీ ల వీరుడు, ఐదు వందల పై చిలుకు వికట్లను కొల్లగొట్టిన నాటి, నేటి, మరెప్పటికీ మరువలేని మరుపులేని క్రికెట్ మైదానపు విజేత. పోరాట ధీరుడు ల బంతిని గింగురులు తిప్పుతూ ఎక్ష్త్ర బౌన్స్ తో బాట్స్మన్ ని ముప్పతిప్పలు పెట్టినా, సారధి అయ్యి జవసత్వాలు లేని బెంగుళూరు జట్టు ని ఫైనల్స్ వరకు తన భుజస్కన్దాల మీద మోసుకునివచ్చినా, గాయం తో మళ్ళి మైదానం లో అడుగుపెట్టినా, పదిహేను సంవత్సరాల పైన భారతీయ క్రికెట్ అభిమానుల ఆశలను నిర్విగ్నముగా నెరవేర్చినా, కెరీర్ అయిపొయింది అన్న సమయములో వికెట్ల జడివాన కుర్పించినా, అది ఒక "పది వికెట్ల" శౌర్యుడికె సాధ్యం. అనీలుడు ఆంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు చెప్పిన సందర్భములో స్పందించి విషాద వదనం తో పల్కిన అక్షర నీరాజనం.

అలుపెరగని ధీరుడవు
శ్రమించే శ్రామికుడవు
స్ఫూర్తిని రగిల్చే ప్రధాతవు
మృదువైన నీ మాటతీరు, శిరస్సు వంచి జయాపజయాలను
చిరునవ్వుతో స్వీకరించే వ్యక్తిత్వ మూర్తుడవు
గాయానికి బెదరని మొక్కవోని ధైర్యం తో
ముందడుగు వేయగల సమర్దుడవు
నేడు వయస్సు భారానికి తలవంచినావా
సలాం శిరస్సు వంచి నీకు సలాం
నీవు లేని క్రికెట్ మైదానం బోసిపోతుందా
జుంబో లేదని ఆగ్రహిస్తుందా
ఆరు అడుగుల ఆజానుబాహుడు కోసం అర్రులు చాస్తుందా!!
నాట్యం ఆడించే చేతులు లేక బంతులు ముడుచుకుంటే
"ఎక్ష్త్ర బౌన్స్" చూడలేక నేను కళ్ళు తిప్పుకుంటే
నింగి కి ఎగసిన నీ కీర్తి పాటవం నన్ను హర్షిస్తుందా!!
నీవు సాధించిన విజయాలు ముందు తరానికి మార్గదర్శకం అయితే
మాకు మాత్రం ఆస్వాదించిన ఆనందాలు
స్పిన్నర్ లేక మీడియం పేసర్ అన్న సందేహాన్ని ప్రక్కన పెట్టి
నా అనీలుడకు చెప్పండి వీడ్కోలు
నీ అభిమనినైన నేను నీకు పలికే "గూగ్లీ" నీరాజనం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి