ఉపోద్ఘాతం: చీకటితో వెలుగే చెప్పెను నేనున్నాని అన్నట్లు అణచివేత లోంచి పోరాటం రగులుతుంది విప్లవ జ్వాలల శికలుగా. ప్రతి ఓటమి ఒక విజయానికి సంకేతం, ఒక ఆలోచనకు పునాది, ఒక చైతన్యానికి ఊపిరి. లక్ష్య సాధన కోసం పడి లేచిన కెరటం...
నా గొంతు తడారిపోయింది
నా కాళ్ళు చచ్చుబడినాయి
నా చేతులు బంధింపబడ్డాయి
నా మనస్సు బాధపడ్తుంది
నా శరీరం అలిసిపోయింది
నా కళ్లు కన్నీటి ధారలవుతున్నాయి
నా ముక్కు పుటలు కమ్పిస్తున్నాయీ
కానీ ఏదొక రోజు
నా చేతి బంధనాలు విచ్చుకుంటాయి
విశ్వ మానవాళి శ్రేయస్సుకై అర్రులు చాస్తూ
నా పాదాలు నిబ్బరముగా చెంగున లక్ష్యం కోసం పరిగెడతాయి
దారిలో ఎదురైన ఆటంకాలను దాటుకుంటూ
నా గొంతు ఎలుగెత్తి కర్తవ్యాన్ని చాటుతుంది
నలుదిక్కులు పిక్కటిల్లేలా
నా మనస్సు ఇంద్రధనుస్సు అయి పరితపిస్తుంది
క్రాంతి ని వీడి కాంతి వైపు సాగమని
నా నయనాలు కలియతిరుగుతూ
నవలోకాన్ని కళ్ళ చూస్తాయి
నా ముక్కు పుటలు స్వేచ్ఛా వాయువును పతాకాన్నిపీలుస్తాయి
మనస్సులో ఆనందాన్ని నింపుతూ
నా శరీరం నాదై , నీదై , అందరిదై
సమాజ శ్రేయస్సుకై పోరాడుతూ
అశువులు దాలుస్తుంది
స్ఫూర్తి: అమృత (సినిమా)
9, జూన్ 2009, మంగళవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి