10, జూన్ 2009, బుధవారం

నేటి సమాజం

ఉపోద్ఘాతం: నేటి సమాజ నాగరిక ప్రపన్ఛికరణకు ప్రతీకా లేక పెరుగుతున్న అసమానతలను తనలో ఇముడ్ఛుకుని ప్రగతికై పరుగు పెడుతూ దప్పికతో అలిసి నీరు అన్దక చతికలపడిన ఆశయమా. నీటి కోసం ప్రయత్నం కూడ చేయక పరుగు పెటాలని వ్రుధా ప్రయస పడుతున్న నేటి సమాజం ఈ లక్ష్య సధనలో విజయం సాధిన్ఛేనా...

<< ఏమైనదోమరి ఈ సమాజానికి తెలియదామరి ఈ జనానికి >>
నాకు నీకు వున్న భాంధవ్యం ఎప్పుడో తెగిపోయే
నేను నువ్వు ముఖాలే చూసుకోకపోయే
పాపిష్టి స్వార్ధమేమో లోకాన్ని చుట్టిపోయే
విశాల ప్రపంచములో మూడడుగులు దొరకకపోయే <<ఏమైనదోమరి>>

గుక్కెడు నీళ్ళ కోసం గొంతు తడరిపోయే
కూల్ డ్రింక్ హాట్ డ్రింక్ అంటు పైసలే కావాలయే
కడుపు నింపే ధాన్యం పండకపోయే
సర్కారు పదకమేమో మనకు అందకపోయే <<ఏమైనదోమరి>>

డబ్బు కోసమే వేమ్పర్లడుతూ వెతుకుతుపోయే
బీద బిక్కి గోడు అసలే పట్టకపోయే
సాతి మనిషికేమో ముఖము చాటేసి పోయే
రంగుల ప్రపంచపు కలలో అల్లుకునిపోయే <<ఏమైనదోమరి>>

ఉద్యోగం వస్తేనేమో దండిగా జేబు నింపుకునే పోయే
చదువు ఏమో నీకేమే పట్టకపోయే
కొలువు కోసమే విజ్ఞానం అంటు పోయే
విద్య విలువలను దిగజార్చి పోయే <<ఏమైనదోమరి>>

పల్లెసీమలేమో అంతరించిపోయే
ప్రజలేమో పట్టణానికి ఎగబదిపోయే
ముదసలలను చూచుకునే దిక్కులేకపోయే
బంధాలు తెగిపోయే బంధుత్వం వీడిపోయే <<ఏమైనదోమరి>>

అవినీతి కోరలేమో లోతుగా దిగబడిపోయే
సర్కారు జమానాలో మూట విప్పితే కానీ పని జరగకపోయే
అర్హుడిని వీడి అనఃరుడికి పట్టం కట్టిపోయే
అభివృద్ది ఏమో గుండు సున్నా ఆయే <<ఏమైనదోమరి>>

బంధుప్రీతి సమాజాన్నిఅంటుకునిపోయే
రాజకీయం రాజుల కార్యం అయిపోయే
వజ్రాలేమో భూమిలోనుండి వెలుపలకు రాకపోయే
భూమాత భారమేమో ఎవరు తీర్చకపోయే <<ఏమైనదోమరి>>

రగిలే విప్లవాలు అడుగంటిపోయే
ఆరాటం లేని పోరాటం రోజు వారి కార్యమయ్యే
కమ్యూనిజం సోషలిజం అన్ని కాపిటలిజం అయ్యే
లోకములో మంచితనం అంతరించిపోయే <<ఏమైనదోమరి>>

సర్కారు పధకాలు అబద్ధాల అమ్మకాలయే
దంచుడు బొంకుడే రాజకీయాల నీతి ఆయె
జనాల డబ్బంతా మార్గమధ్యలోనే చేల్లిపోయే
నిండని కడుపులు ఆకలితో అలమటించిపోయే <<ఏమైనదోమరి>>

సాగునీరు లేక పంట భూములు బీడులు అయ్యే
ఊన్న భూమినేమో అపార్ట్మెంట్ ల కబ్జ్హ అయ్యే
లక్షల భూమి కోట్లకై పడగలేట్టిపోయే
రియల్ ఎస్టేట్ భాగోతం గుండెల్లోని బాకు అయ్యే <<ఏమైనదోమరి>>

సమాజం ఎన్నో సమస్యల తో నిండిపోయే
ప్రస్తావిస్తే పేజీలే నిండిపోయే
ఇవన్నితీరే రోజు కోసం ఎదురుచూస్తుపోయే
నగారా పట్టి విప్లవ శంఖం పూరించి ఘర్జించి పోయే <<ఏమైనదోమరి>>

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి