5, ఆగస్టు 2009, బుధవారం

ఫ్యాక్షనిజం

నెమలి కన్నుల బెదిరింపుల
రాక్షస కోరల చప్పుళ్ళు
మానవత్వాన్నే మరిచిన మరణ మృదంగం
జనాల ఆశల ప్రతిబంధకం ఫ్యాక్షనిజం
మరువలేని వదలలేని దాష్ఠిక మేనరిజం

విరిసీ విరియని కుసుమాలు వెతల ప్రతుల సాక్షిగా

విగత జీవులై పడుతూ, జీవచ్ఛవాల పోరాటములో
20వ శతబ్ధి లొ ఫ్యాక్షణ హత్యలు దేనికి ప్రతీక
భూమతను విడిచి వెళ్ళిన ఆనాటి రాక్షసత్వమా !!
లేక ఆకృత్యాల సుఖప్రసవం కోసం ఎదురుచూస్తున్న ఈనాటి మానత్వమా!!

ఈ యమకింకరి గోదాములో విజయము ఎవరిది?
ఇది మరో నిత్య కురుక్షేత్రం
విజయము ఒకరి సొత్తు కాదు
ఏనాటి జయుడికైనా దొరికేది నెత్తుటి కూడు, రక్తపు కన్నీరే

ఎవరి వీరు?? నరహంతకులా లేక రాయలసీమ పౌరుష రారాజులా

కాలయముడు వంటి కక్షల కార్పణ్యాలతో
బ్రతుకు పుస్తకములో అఙ్ఞాతవాసం, మరణ గీత మాత్రమే రాసుకుని
పోరటాలకు ఊపిరి నిలిపి వేరొకరి వుసురు తీసే కాళహంతకులు

ఆధిపత్య పోరులో ఆదమరిచి మానవత్వానికి సంకెళ్ళు వేసి

తోడబుట్టినా, పిల్లనిచ్ఛినా కడతేర్చి విచక్షణ కోల్పోయిన మరణ విమోచనం, మానవత్వ వియోగం
బదులు తీర్చుకోవాలని కసితో
ప్రాణానికి ప్రాణం
సంతోషానికి సంతోషం దోచుకుని
రగిలిపొతున్న వారసత్వ పరిపాలకులు, కాఠిన్యం ముసుగులోని అమాయకులు

బాంబుల గడ్డ ఆళ్ళగడ్డ అయినా, అనంతమైన కక్షల కటారుల అనంతపురమైనా
సూరి జైలు జీవితమైనా పరిటాల వంశ నాశనమైనా
కప్పట్రాళ్ళ పద్మక్క ఎదురుదాడైనా
తాడిపత్రిలొ జే.సి. సోదరుల అరాచకం అయినా
ఏదైనా ఎవరైనా ఈ ఫ్యాక్షనిజం గుప్పిట్లోనే

వర్గం కోసం నాయకుడు,నాయకుడు కోసం ప్రజల
ఎవరి కోసం ఎవరి త్యాగం
ఎవరి కోసం ఎవరి ప్రాణం పణం
చీనీ చెట్లను పెకిలించినా, మనిషిని మొదలికంట నరికినా
ఏ పట్టభిషేకం కోసం ఈ అరాచకం

ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం
ఎటువెళ్ళుతుంది ఈ ఫ్యాక్షన్ భాగోతం
నాటి పాలెగాళ్ళ, మొన్నటి ఫ్యాక్షనిస్తుల, నేటి భూకబ్జా భకాసురులు
సెటిలమెంటుల సారధులు
రాజకీయ దురంధురులు
పౌరుషాగ్ని కాస్తా ధనయఙ్ఞం అయ్యి
శత్రువుల మీద పై చేయి
చరిత్ర కల్గిన కుటుంబ కలహాలకు పరిమితం కాక
విస్తరిస్తున్న మఫియా
రాజకీయ ప్రత్యర్ధి పోరు, గెలుపోటముల ప్రతిష్ఠ
ప్రభుత్వ సహకారం, ప్రత్యర్ధుల హత్యకు ఉపకారం

వేళ్ళూనుకున్న కక్షల వట వృక్షం
ఎల్లలు దాటుతున్న విష సంస్కృతి
ఏమి చేస్తే ఈ మారణ హొమం ఆగేను
ఎప్పుడు చల్లారెను ఈ పౌరుషాగ్ని శిఖలు
వేళ్ళను వేరుచేసినా వృక్షం నిలబడు
చెట్టును తెగనరికినా మరొకటి పెరుగు

చేసేదేముంది...సంస్కృతిలోనే మార్పు రావాలి
పరివర్తన కోసం ఎదురుచూడాలి
కాని ఓపిక నశించి "ఇంక చాలు ఆపండి" అని చెప్పేదెవరు

ఈ పొరుష బిల్లిలా మెడలో గంట కట్టేదెప్పుడూ!!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి